మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన

95
SHARE

న్యూఢిల్లీ:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ప్రకటన చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని ‘‘బహిరంగంగా ఉరి తీస్తామని’’ పేర్కొన్నారు. భోపాల్‌లో ఇవాళ ఆయన మహిళల కోసం కొత్తగా ‘‘ముఖ్యమంత్రి మహిళా కోశ్’’ పథకాన్ని ఆవిష్కరించారు. వివాహం కాని 50 యేళ్లు పైబడిన ఒంటరి మహిళలకు ఈ పథకం కింద పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించారు.
మహిళలు లేకుండా ఒక్కరోజు కూడా ఏ పనీ జరగదని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘మహిళల కోసం కేవలం 1 రోజే ఎందుకు? మహిళలు లేకుండా ఒక్క రోజైనా ఇల్లు గడుస్తుందా? దేశం, ప్రపంచం ముందుకు నడవడం కుదురుతుందా? అసాధ్యం! మన దేశంలో ఎప్పటినుంచో స్త్రీలను ఆరాధించడం, గౌరవించడం సంప్రదాయంగా వస్తోంది. ఇవాళ మహిళలు అనేక కీలక హోదాల్లో రాణిస్తున్నారు..’’ అని చౌహాన్ పేర్కొన్నారు.