రేడియేషన్ తగ్గించుకోండిలా!

201
SHARE

మొబైల్ వాడకం పెరిగిపోయిన నేటి రోజుల్లో రేడియేషన్ వల్ల అనేకమంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు పెరిగిన తర్వాత ఆ ఇబ్బందులు మరింత పెరిగాయి. అయితే ఈ రేడియేషన్ తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకోండి మరి!
ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్ ఫోన్ల వలన “కేన్సరు ప్రమాదాలు” ఉన్నాయని చెప్పింది. ముఖ్యంగా మానవులకు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ అని అర్ధం. తలకు దూరంగా పెట్టుకొని ఫోన్ ఉపయోగించే వారి కన్నా తలకు దగ్గరగా చేతితో పట్టుకొని ఫోన్ ఉపయోగించే వినియోగదారులకు మెదడు క్యాన్సర్ మరణం రేటు ఎక్కువగా ఉంది. ఒక ఫోన్ యొక్క యాంటెన్నా నుండి వస్తున్న రేడియేషన్ పరిధి వలన శ్రవణ నాడి యొక్క ఒక నిరపాయమైన కణితి మరియు శబ్ద నాడి గ్రంథి ప్రమాదం ఉంటుంది. ఆరు సంవత్సరాలు లేదా ఎక్కువ కాలం సెల్ ఫోన్లను ఉపయోగించే వ్యక్తులు యాభై శాతం కన్నా ఎక్కువగా ఉన్నారు. అంతేకాక, సెల్ ఫోన్ ఉపయోగం వలన, దానికి మరియు ట్యూమర్ మధ్య సంబంధం ఒక మోతాదు ప్రతిస్పందన రేఖ అనుసరించటం కనిపించింది.
మెదడు బయట అరుదైన న్యూరో ఎపిథీలియల్ కణితుల ప్రమాదం రెట్టింపు ఉంది. గణాంకపరంగా చూస్తే, సెల్ ఫోన్ ఉపయోగించని వారి కంటే సెల్ ఫోన్ ఉపయోగించే వారిలో ప్రమాదం ఎక్కువగా ఉంది.తల కుడి వైపు ఫోన్ వాడకం వలన, తల కుడి వైపు సంభవించే మెదడు కణితుల మధ్య కొన్ని సహ సంబంధం ఉన్నట్లు కనిపించింది.
-వీలైనంత వరకు ఫోన్ మాట్లాడే సమయంలో ఇయర్‌ఫోన్ వాడండి. లేదంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఇలా చేస్తే కొంతైన రేడియేషన్ ప్రభావం తగ్గించవచ్చు.

-ఫోన్‌లో సిగ్నల్ తక్కువున్న సమయంలో కానీ, చార్జింగ్‌తక్కువగా ఉన్న సమయంలో కానీ ఫోన్ మాట్లాడకండి. ఇలాంటి పరిస్థితుల్లో మామూలు కంటే ఎక్కువ రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది.
-ఫోన్ కంటే ఎక్కువగా మెసేజ్‌లు పంపడానికే మొగ్గు చూపండి. కొంతైనా రేడియేషన్ తగ్గించినవారవుతారు.
-డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడొద్దు. ఇలా చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ పవర్ ఎక్కువగా ఉండడమే కాక, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
-వీలైనంత వరకు రేడియేషన్ తక్కువగా విడుదల చేసే ఫీచర్ ఫోన్లు వాడడం రేడియేషన్ తగ్గించడానికి మరో మార్గం.
-స్మార్ట్‌ఫోన్ల కంటే ల్యాండ్‌లైన్ మొబైల్స్‌లో రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌కి బదులు ల్యాండ్‌లైన్ వాడండి.
-వీలైనంత వరకు మొబైల్‌ని శరీరానికి దూరంగా ఉండేలా చూసుకోండి.
-ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు ఎత్తిన తర్వాతనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకోండి. ఫోన్ ఆన్సర్ చేసేటప్పుడు వెలువడే రేడియేషన్ పదిరెట్లు అధికంగా ఉంటుంది.
-రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ తల పక్కన పెట్టుకొని పడుకోవడం మంచిది కాదు. రాత్రి సమయంలో రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుంటుంది.
-చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అస్సలు వాడకండి. సాధారణ సమయంలో కంటే చార్జింగ్ పెట్టినప్పుడు రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుంది.