ఒక్క నిమిషం నిబంధన కానీ…

104
SHARE


ఉభయ రాష్ట్రాల్లో రేపు పదోతరగతి ప్రధాన పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం తొమ్మిదిన్నరకు మొదలయ్యే పరీక్ష కోసం సమయానికి రావాల్సిందేనని అధికారులు ఢంకా బజాయిస్తున్నారు ఒక్క నిమిషయం ఆలస్యమైనా అనుమతించబోమని ఆంధ్రాలో అధికారులు కరా ఖండిగా చెబుతున్నారు. రూలంటే రూలేనని అవన్నీ జాన్తానై అంటున్నారు ఏపీ అధికారులు తేల్చి చెప్పారు.కానీ తెలంగాణలో మాత్రం ఐదు నిమిషాలు వరకు ఆలస్యమైనా అనుమతిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది దీంతో పది పరీక్ష వ్రాసే విధార్ధులకు వారి తల్లి తండ్రులకు కాస్త ఊరట లభించింది. ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేసింది విద్యాశాఖ నిబంధన అయితే ఉంటుంది కానీ.. అది ఒక్క నిమిషం కాదని ప్రకటించింది. ఇక నుంచి ఐదు నిమిషాలు ఆలస్యం అయినా అనుమతి ఇస్తామని వెల్లడించారు. ఐదు నిమిషాల తర్వాత మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ డైరెక్టర్ జి.కిషన్.

ఒక్క నిమిషం అనేది విద్యార్థులను ఆందోళనకి గురి చేస్తోందని.. ఈ క్రమంలో ఈ నిబంధనను సడలించటం జరిగిందన్నారు. రేపు 15వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే పదో తరగతి ఎగ్జామ్ కి హాజరయ్యే స్టూడెంట్స్ ను.. 5 నిమిషాల ఆలస్యం వరకు అనుమతించటం జరుగుతుందన్నారు.
ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని.. విద్యార్థులు అందరూ కచ్చితంగా 45 నిమిషాలు ముందు అంటే 8:45 గంటలకే ఎగ్జామ్ సెంటర్ కు హాజరుకావాలని సూచించారు. ఈ ఏడాది 5లక్షల 38వేల 867 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. వీరిలో 2లక్షల 76వేల 388 మంది బాయ్స్, 2లక్షల 62వేల 479 గాల్స్ ఉన్నారు.