ఈ రోజు రాశి ఫలాలు – 20 గురువారం సెప్టెంబర్ 2018

65
SHARE
today horoscope

శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; శుక్ల పక్షం ఏకాదశి: రా. 12-41 తదుపరి ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్రం: మ. 2-36 తదుపరి శ్రవణం అమృత ఘడియలు: ఉ. 7-31 నుంచి 9-17 వరకు తిరిగి తె. 5-40 నుంచి వర్జ్యం: రా. 7-02 నుంచి 8-48 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ. 2-44 నుంచి 3-32 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5-52; సూర్యాస్తమయం: సా.5-57 విష్ణు పరివర్తన ఏకాదశి

మేషం
ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయి దా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం
ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదరసంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడతారు.

మిథునం
మీ పై అధికారులతో కానీ, సహోద్యోగుల తో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాదవివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.




 

కర్కాటకం
మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.

సింహం
ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పను లు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతం గా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.

కన్య
ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుం ది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్ర త్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

తుల
ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం
ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

ధనుస్సు
ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.


మకరం
ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

కుంభం
ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

మీనం
ఈ రోజు మీకు ఆనందంగా, లాభదాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనవసర వివాదాలకు తావివ్వకండి.