ఈ రోజు రాశి ఫలాలు – 06 శనివారం అక్టోబర్ 2018

83
SHARE
today horoscope

మేషం :ఈ రోజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. మానసిక ఘర్షణను నివారించండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. మాట విషయంలో జాగ్రత్త వహించండి. వినే అన్ని విషయాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. అపోహలకు లోనవకండి. ఏ నిర్ణయమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి.

వృషభం :ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పు గానీ, ట్రాన్స్ఫర్ గానీ ఉంటుంది.




 

మిథునం :ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనడం గానీ, బాగు చేయించడం గానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

కర్కాటకం :ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం గానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం గానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

సింహం :ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం గానీ, ఇతరుల సాయం తీసుకోవడం గానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

కన్య :ఈ రోజు మీరు చేసిన సాయం కారణంగా మీ స్నేహితులలో మీ పైన ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి. గుర్తింపును, నమ్మకాన్ని పొందుతారు. దూర ప్రాంతం నుంచి అనుకోని శుభవార్త వింటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.

తుల :ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

వృశ్చికం :ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం గానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడం గానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ మార్పు కోరుకుంటారు.



ధనుస్సు :ఈ రోజు మానసికంగా ఆందోళన కలిగించే సంఘటన గానీ, అనుకోకుండా డబ్బు ఖర్చు అవడం గానీ జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఇతరుల విషయాల్లో కల్పించుకొని అవమానాల పాలవద్దు. మా భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

మకరం :ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలను మెరుగు పరచుకోవడానికి అనువైన దినం. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి. మీ ప్రేమను వ్యక్త పరచడానికి కూడా అనుకూలమైన రోజు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. సంఘంలో గౌరవం కల వ్యక్తులను కలుసుకుంటారు.

కుంభం :ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. చాలాకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యపై విజయం సాధిస్తారు. మీ ఇంటికి కావలిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. మీ తల్లి తరపు బంధువులను కలుసుకుంటారు.

మీనం :మీ ఆలోచనలను, అభిప్రాయాలను, ప్రేమను వ్యక్త పరచడానికి అనుకూలమైన రోజు. మానసికంగా కొంత ఉత్సాహంతో, కొంత ఆందోళనతో ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు దూరంగా ఉండటం మంచిది. మీ సంతానం నుంచి ప్రేమాభిమానాలు అందుకుంటారు.