ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు

155
SHARE


ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెక్ హాకింగ్ చనిపోయారు. బ్లాక్ హోల్స్ గురించి ఆయన చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. గ్రహాంతర వాసుల ఉనికి గురించి కూడా పరిశోధనలు చేశారు. నరాలకు సంబంధించిన అరుదైన మోతార్ న్యూరాన్ వ్యాధితో ఐదు దశాబ్దాల నుంచి బాధపడుతున్నారు. నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి కారణంగా చాలా ఏళ్ల నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు హాకింగ్. ఆయన మాట్లాడలేకపోయినా… కంప్యూటర్ సాయంతో హాకింగ్ మాటలు బయటకు వచ్చేవి. ఆయన మృతిపై పలువురు సైంటిస్టులు సంతాపం ప్రకటించారు. 1942 జనవరి 8న ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు.

కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్చీకి అతుక్కు పోయిన మనిషి, మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం.. ఇవి స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా.. శరీరం సహకరించక పోయినా.. కృష్ణ బిలాల పై చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం.
Related Video Embedded from Youtube