ఆరేళ్ల పసిబాలుడి పై పైశాచికత్వం..!

149
SHARE

నీచాలు,వావి వరుసలు, వయసు తారతమ్యాలు అన్ని మరచిపోయి,మోస పూరిత విదానాలతో చిన్నవాళ్ళు , పెద్దవాళ్ళు అనే బేద బావం లేకుండా అక్ర‌మ సంబందాలు పెట్టుకుంటున్నారు. వైవాహిక బందం లేకుండా స్త్రీ , పురుషులు సంబందం పెట్టుకున్నా , తమ మద్య ఉన్నది భార్యా భర్తల సంబందమే అని బావిస్తుంటారు. కాబట్టి తనతో సహజీవనం చేసే పురుషుడు , తన స్వంత సంతానానికి కూడా తండ్రి లాగే ఉండాలని , స్త్రీలు బావిస్తారు. పురుషులు కూడా అలాగే బావించాలి.వావి వ‌రుస‌లు మ‌ర‌చి అక్ర‌మ సంబందాలు పెట్టుకుంటే ఏమీ జ‌రుగుతుందో ఈసంఘటన చూస్తే తెలుస్తుంది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో  తల్లి ప్రియుడు కర్కశత్వాన్ని ప్రదర్శించాడు.ప్లాస్టిక్‌ తీగతో విచక్షణారహితంగా బాలుడిని కొట్టాడు. దీంతో ఒంటిపై వాతలు తేలి ఆ బాలుడు తల్లడిల్లడంతో స్పందించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన హృదయవిదారక ఘటన ఇది. సంఘటన వివరాలు ఎస్సై కె.కృష్ణ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయమ్మ భర్త మృతిచెందడంతో బ్రతుకుదెరువు కోసం కుమారుడు పవన్‌కుమార్‌(6)తో కలిసి నగరంలోని బోరబండ మోతీనగర్‌ సమీపంలోని బబ్బుగూడకు వచ్చి నివాసం ఉంటోంది. ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమెకు కారు డ్రైవర్‌ పెద్దిరాజు పరిచయమయ్యాడు. దీంతో ఏడాదిగా జయమ్మ పెద్దిరాజుతో కలిసి సహజీవనం చేస్తోంది. బబ్బుగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న పవన్‌కుమార్‌ను తల్లితో కలిసి ఉంటున్న ఆమె ప్రియుడు పెద్దిరాజు తరచూ హింసిస్తున్నాడు. తల్లిలేని సమయంలో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పవన్‌కుమార్‌ అల్లరి చేస్తున్నాడనే కారణంతో పెద్దిరాజు ప్లాస్టిక్‌ తీగతో ఇష్టం వచ్చినట్లు బాలుడిని కొట్టాడు. ముఖం, వీపు, కాళ్లు, చేతులపై తీవ్రంగా కొట్టడంతో వాతలు తేలాయి. బాలుడు ఏడుస్తూ పరుగులు పెడుతున్నా వదలకుండా వెంటపడి మరీ కొట్టాడు. బాలుడి ఆర్తనాదాలను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని పెద్దిరాజును పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బస్తీ అధ్యక్షులు వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడు పెద్దిరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి: బాలల హక్కుల సంఘం ఆరేళ్ల బాలుడు పవన్‌కుమార్‌ను ప్లాస్టిక్‌ తీగతో విచక్షణా రహితంగా వాతలు తేలేలా కొట్టిన నిందితుడు పెద్దిరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. బాలుడి తల్లిపై కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలన్నారు.