మహిళలూ హై హీల్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

103
SHARE

మహిళలూ హై హీల్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారని ఆరోగ్య నిపుణులు. పొట్టిగా ఉండడం వల్లనో, లేదా ఫ్యాషన్‌గా భావించడం వల్లనో, ఫ్యాషన్‌గా కనిపించడం కోసమో లేక మరేదైనా కారణాల వల్లనో హైహీల్స్‌ తరహా చెప్పులను ఎక్కువగా మహిళలు ఇష్టపడుతుంటారు. కానీ హైహీల్స్‌ వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు.
తరచూ ఎత్తుమడమల చెప్పులు వాడేవారిలో మోకాళ్ల నొప్పి 26 శాతం అధికంగా ఉంటుంది. వాటి ఎత్తు పెరిగే కొద్దీ ఈ నొప్పి 76 శాతం వరకూ పెరగడానికి మోకాలి కీళ్లు అరిగిపోయే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చైనాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో హైహీల్స్‌ చెప్పులు ధరించిన వారిలో మోకాలి కీలులో అరుగుదల కనిపించినట్టు పరిశోధకులు గుర్తించారు. హైహీల్స్‌ ఉన్న చెప్పులు, షూలు వేసుకుని ఎక్కువగా రోజూ బస్సు ఎక్కడానికో లేదా ఏదో ఒక విషయానికి పరుగులెత్తాల్సి వస్తుంది.
అయితే హైహీల్స్‌ వేసుకుని పరుగులెత్తడం వల్ల దీర్ఘకాలంలో దాని ప్రభావం మోకాలి కీలుపై ఎక్కువగా ఉంటుందని, హైహీల్స్‌ వల్ల మోకాలిపై ఎక్కువ భారం పడుతుందని, దీని ఫలితంగా కీలు అరుగుదల వేగవంతం అవుతుందని, మడమల్లో కూడా ఇది తీవ్రమైన నొప్పికి కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు.
ఎత్తు మడిమల చెప్పులు పాదం యొక్క సహజమైన పొజిషన్‌ను మారుస్తాయి. శరీరానికి చెందిన ఎక్కువ బరువును మడిమలపై మోపడం వల్ల పాదం ముందు భాగంపై అధికంగా ఒత్తిడి పడుతుంది

శరీర బరువుంతా సమానంగా పంపిణీ అయ్యే వ్యవస్థను ఎత్తు మడిమల చెప్పులు దెబ్బ తీస్తాయి. దీని వల్ల పొట్ట ముందుకు, పిరుదులు వెనక్కి వాటంతట అవే కదులుతాయి. దీంతో వెన్నెముక కింది భాగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. శరీరం చక్కని ఆకృతిని కోల్పోతుంది.

ఎత్తు మడిమల చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. అసహజమైన పాదం ఆకృతి వల్ల కాలి పిక్కలు బాగా నొప్పి పుడతాయి.
హై హీల్స్ చెప్పులను ఎక్కువగా వేసుకుంటే ఏకిల్స్ టెండన్స్ (Achilles tendons) అనే రుగ్మతకు లోనయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఆ చెప్పులకు బదులుగా సాధారణ చెప్పులు వేసుకున్నా పాదం నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. మామూలుగా నడిచినా ఇబ్బందిగానే అనిపిస్తుంది. పాదంపై ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది.
రోజూ హై హీల్స్ చెప్పులను ధరించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్రధానంగా మడిమల వద్ద ఉండే కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి.

హై హీల్స్ చెప్పులతో బ్యాక్ పెయిన్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చెప్పులు శరీర గురుత్వ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి మారుస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ కలుగుతుంది.
Closeup of young woman suffering from back pain; Shutterstock ID 81292780; PO: The Huffington Post; Job: The Huffington Post; Client: The Huffington Post; Other: The Huffington Post
కొన్ని సందర్భాల్లో కాలి వేళ్లు నిస్సత్తువగా, స్తబ్దుగా మారుతాయి. అయితే దీన్ని పట్టించుకోకుండా అలాగే హై హీల్స్ చెప్పులను వాడితే అది కాలి వేళ్లలోని నరాలను శాశ్వతంగా దెబ్బ తీస్తుంది.
హై హీల్స్ చెప్పుల వెనుక భాగంలో పదునుగా ఉండే స్ట్రిప్ పాదంపై 30 శాతం అదనపు ఒత్తిడిని కలగజేస్తుంది. ఇవి ఎంత ఎత్తుగా ఉంటే దాని వల్ల అంత అనారోగ్య సమస్య కలుగుతుంది. ప్రధానంగా మడిమలు, పిక్కలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి.
హై హీల్స్ చెప్పులను ఎక్కువగా వాడితే శరీర వెన్నెముక తన సహజమైన షేప్‌ను కోల్పోతుంది. దీంతో బ్యాక్ కొద్దిగా వంగినట్టు అవుతుంది. దీని వల్ల శరీర ఆకృతిలో తేడా వస్తుంది.
హై హీల్స్ వల్ల పాదం కండరాలు ఎక్కువగా దెబ్బ తింటాయి. కాళ్లు నొప్పులకు, బెణుకులకు గురవుతాయి. సో, ఫ్యాషన్ సంగతి పక్కన పెడితే వీలైనంత వరకు వీటిని ధరించకపోవడమే ఉత్తమం.
ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే వారంలో రెండు రోజులు మాత్రమే వేసుకుని తక్కిన రోజులు ఫ్లాట్స్‌ ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. కాదు ఉద్యోగరీత్యా రోజూ ధరించాలంటే… రెండు అంగుళాలకు మించని వాటిని ఎంచుకోవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా వాటిని వదిలేసి నడవాలి.

** నిద్రపోయే ముందు అరికాళ్లని రాళ్ల ఉప్పు వేసిన గోరువెచ్చని నీటిలో ఐదు నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే కండరాలకు ఉపశమనంగా కూడా ఉంటుంది. పాదాల నొప్పులు ఎదురుకావు.
** కాళ్లకు పుదీనా సుగుణాలున్న నూనెతో మర్దన చేసుకుంటే చక్కని ఉపశమనం అందుతుంది. ఇవి కాకుండా చిన్నచిన్న వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది. కుర్చీలో కూర్చుని మడమ కింద ఒక టెన్నిస్‌బాల్‌ని ఉంచి మడమతో దాన్ని ఒత్తాలి. ఇలా చేస్తూ ఉంటే రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
** పాత టర్కీ టవల్‌ని ఒకదాన్ని తీసుకుని, గట్టిగా చుట్టి కాళ్ల కింద పెట్టుకుని అరికాళ్లతో అటూఇటూ దొర్లిస్తూ ఉండాలి. ఇలా పది నుంచి ఇరవై సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
** కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. ఇప్పుడు ఒక చున్నీని కానీ, తాడుని కానీ తీసుకుని అరికాళ్లు చుట్టూ వేసి తాడు సాయంతో పాదాల్ని ముందుకు లాగుతూ ఉండాలి. అలా ఒక అరనిమిషం చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
** కుర్చీలో కూర్చున్నట్టుగా వూహించుకుని చేతులు రెండూ ముందుకు చాపి గాల్లో కూర్చోవాలి. కానీ కాలి మడమలని మాత్రం నేలమీద నుంచి పైకెత్తకూడదు. కాసేపటికి మళ్లీ యథాస్థానానికి రావాలి. ఇలా పదిసార్లు చేయాలి.