షమీ భార్య ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ

93
SHARE
ముంబై: టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా టీం ఇండియా ఆటగాళ్ల వేతనాలు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ ప్రకటించిన ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో షమీ పేరును బీసీసీఐ తొలగించింది. షమీకి దేశంలో ఎంతో మంది మ‌హిళ‌ల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, అత‌నికి త‌న కంటే ముందే పాకిస్తాన్‌కు చెందిన మ‌హిళతో వివాహం కూడా జ‌రిగింద‌ని ష‌మీపై అత‌ని భార్య హసీన్ జహాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై షమీ ఆ ఆరోపణలు అన్ని అబద్ధాలే అని వివరణ కూడా ఇచ్చాడు. కానీ అప్పటికే ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనమైంది. షమీకి అక్రమ సంబంధంపై ప్రతి న్యూస్ ఛానల్‌లో కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో షమీని ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో కొనసాగించడం వల్ల విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన బీసీసీఐ అతని పేరును ఒప్పంద ఆటగాళ్ల జాబితాలోంచి తొలగించినట్లు సమాచారం. ఈ రోజు ప్రకటించిన వేతనాల పెంపు ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లకు రూ.7 కోట్లు, ఏ కేటగిరీ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, బీ కేటగిరీ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరీ ఆటగాళ్లకు కోటి రూపాయిలు పెంచుతున్నట్లు బీసీసీఐ తెలిపింది.
షమీ వివాహేతరం సంబంధం.. 
భారత క్రికెటర్ల వేతనాల చెల్లింపు కోసం బీసీసీఐ సరికొత్త కాంట్రాక్ట్ సిస్టమ్‌ను రూపొందించింది. అందులో భాగంగా కొత్త ఏ+ గ్రేడ్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ సూచనల మేరకు ఇక నుంచి భారత సీనియర్ జట్టులో ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలు ఉంటాయి. ఏ+ కేటగిరీలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తారు. కేటగిరీ-ఏ పరిధిలోకి వచ్చే ఆటగాళ్లకు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందిస్తారు. బీ-కేటగిరీలోకి వచ్చే వారికి రూ.3 కోట్లు, సీ- కేటగిరీలో వచ్చే వారికి రూ.1 కోటి చొప్పున చెల్లించనున్నారు. మహమ్మద్ షమీపై అతడి భార్య చేసిన వివాహేతర సంబంధం వ్యాఖ్యల నేపథ్యంలో అతడిపై వేటు వేశారు. షమీ కాంట్రాక్ట్‌ను విత్‌హెల్డ్‌లో పెడుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.