ఉగ్రరూపం దాల్చిన రైతు మహాపాదయాత్ర

95
SHARE

మహారాష్ట్ర రైతు పాదయాత్ర అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తున్నది. మంగళవారం సాయం త్రం నాసిక్‌లో మొదలైన పాదయాత్ర ఆదివారం ముంబైకి చేరుకున్నది. పుడమి తల్లిని నమ్ముకుని కండలు కరిగించే అన్నదాతలు 180 కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా పూర్తిచేశారు. సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎస్) పేర్కొన్నది. కాగా రైతుల పాదయాత్రపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వేల మంది రైతులు ఒక్కసారిగా నగరంలోకి రావడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. రైతులతో యాత్రను విరమింపజేయడానికి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 

దిగొచ్చిన ప్రభుత్వం: ఆందోళన విరమించిన రైతులు

మహారాష్ట్రలో  రైతులు  ఆందోళన  విరమించారు. తమ  డిమాండ్లు  కొన్నింటికి  ప్రభుత్వం  అంగీరించడంతో నిరసనను  ఆపుతున్నట్టు  రైతులు ప్రకటించారు . కొన్ని డిమాండ్లకు  ఓకే చెప్పిన  ప్రభుత్వం… మరికొన్నింటిపై  చీఫ్ సెక్రటరీ  నేతృత్వంలో  కమిటీ  వేస్తున్నట్టు  ప్రకటించిందిమరాఠా రైతుల ఆందోళనకు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం దిగి వచ్చింది. 12 డిమాండ్లతో నాసిక్ నుంచి ముంబయికి పాదయాత్రగా తరలివచ్చిన రైతుల డిమాండ్లలో కొన్నింటికి ప్రభుత్వం ఓకే చెప్పింది. కొన్ని డిమాండ్లను అమలు చేస్తామని రైతులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను విరమించుకున్నారు రైతులు. భూ యాజమాన్య హక్కులపై చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ వేస్తామంది ప్రభుత్వం.లోన్ల రద్దు, కనీస మద్ధతు ధర పెంపు, భూమి యాజమాన్య హక్కుల డిమాండ్లతో ఆల్ ఇండియా కిసాన్ సభ నేతృత్వంలో దాదాపు 50వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబయి వరకు 180 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ముంబయి ఆజాద్ మైదాన్ లో సభ పెట్టారు.
కాంగ్రెస్, NCP, MNS, శివసేన నేతలు రైతులకు మద్దతు తెలిపారు. తర్వాత కొందరు రైతు ప్రతినిధులను చర్చలకు పిలిచింది ప్రభుత్వం. సీఎం ఫడ్నవిస్ వారితో సమావేశమయ్యారు. తర్వాత రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఆజాద్ మైదాన్ కు వచ్చి ప్రభుత్వం తయారు చేసిన డ్రాఫ్ట్ ను చదివి వినిపించారు.మొత్తంగా సీఎం హామీతో ఆందోళనను ఆపుతున్నట్టు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది. ప్రభుత్వ హామీలపై చర్యల కోసం వేచి చూస్తామని… త్వరలోనే తర్వాతి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది.