రాష్త్రంలో భారీగా కొలువుల భర్తీకి అనుమతి ..

188
SHARE
 • మే నెలాఖరు నాటికి 30 వేల ఉద్యోగాల భర్తీ
 • టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు
 • ఏప్రిల్‌కు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
 • వారంలో గ్రూప్‌-2కు క్లియరెన్స్‌?
 • మార్చి రెండో వారానికి ఎంపిక పూర్తి!
 • నెలలో 5 వేల గ్రూప్‌-4 పోస్టులు
 • విద్యుత్తులో మరో 1,871 భర్తీ

హైదరాబాద్‌:నిరుద్యోగ యువతకు తీపి కబురు! పోలీసు కొలువులు.. టీచర్‌ కొలువులు.. గ్రూపు-2 కొలువులు.. గ్రూప్‌-4 కొలువులు.. రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగు నెలలూ వరుసగా కొలువుల జాతరే! విద్యుత్తు శాఖలో 1,871 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే కొనసాగుతోంది. ఇక, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎ్‌సపీఎస్సీ వేగం పెంచింది. మే నెలాఖరుకు 30 వేల మందికి నియామక పత్రాలు ఇవ్వడమే లక్ష్యంగా చర్యలుచేపట్టింది. ఏప్రిల్‌కు పీజీటీ, టీజీటీ, మిగతా అన్ని కేటగిరీల 7300 గురుకుల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. అలాగే, విద్యా శాఖ పరిధిలోని టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 8,792 పోస్టులకు ఫిబ్రవరి 24నుంచి రాత పరీక్షలు నిర్వహించి ఏప్రిల్‌ చివరికి నియామకప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది.
 అటవీశాఖలో 2వేల పోస్టుల భర్తీకి రాత పరీక్ష పూర్తిచేసిన టీఎస్‌ పీఎస్సీ.. నెల రోజుల్లో వీటి భర్తీ ప్రక్రియను పూర్తి చేయనుంది. 1036 గ్రూప్‌-2 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. కోర్టు కేసులతో కొన్ని నెలలుగా ప్రక్రియ నిలిచిపోయింది. కేసులో వారంలోగా హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే వారంలోగా ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభించి మార్చి రెండో వారానికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. అంతేనా, సుమారు 5 వేల పోస్టులతో నెల రోజుల్లో గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వీటిలో పంచాయతీ సెక్రటరీ పోస్టులు 2500, వీఆర్‌వోలు 1200, రెవెన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌,దేవాదాయశాఖలో 800పోస్టులు ఉన్నాయి. విద్యుత్తు శాఖలో 1871 ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రాన్స్‌కోలో 1100 జూనియర్‌ లైన్‌మెన్‌, 174 సబ్‌ ఇంజనీర్‌, 330 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. జేఎల్‌ఎం పోస్టులకు ఈనెల 11న; సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు 25న; ఏఈ పోస్టులకు మార్చి 3న రాతపరీక్ష జరగనుంది. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌)లో 153 ఏఈ, 114 జేఏవో పోస్టుల భర్తీకి ఈనెల 19లోగా దరఖాస్తుల స్వీకరణ, మార్చి 25న రాతపరీక్ష ఉండనుంది.
 
 • ‘పోలీసు’లో 14,177 ఉద్యోగాలు
 • ఎస్సీ గురుకులాల్లో 549 పోస్టులు
 • ఎంపికకు సర్కారు ఉత్తర్వులు జారీ
 •  రాష్ట్రంలో మళ్లీ కొలువుల జాతర
 •  పోలీసు బోర్డు, టీఎ్‌సపీఎస్సీ ద్వారా ఎంపిక..
 • ప్రభుత్వం ఉత్తర్వులు
 నిరుద్యోగ యువతకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చింది! ముఖ్యంగా పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఇదో సువర్ణావకాశం! కానిస్టేబుల్‌ మొదలు ఎస్సై వరకు వివిధ పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్‌ సర్కారు మొదటి నుంచి పోలీసు శాఖ పటిష్ఠానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 వేలకు పైగా కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసింది. ఇదివరకే ఎంపికైన ఎస్సైలు శిక్షణలో ఉన్నారు. తాజాగా మళ్లీ ఈ శాఖలో ఏకంగా 14,177 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఎస్సీ అభివృద్ధి శాఖలోనూ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాఖలో 549 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పోస్టులన్నింటినీ ప్రత్యక్ష ఎంపిక విధానం(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌)లో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు శాఖలు.. 14,726 పోస్టులు
రాష్ట్ర డీజీపీ నియంత్రణలో ఉండే వివిధ విభాగాల్లో 14,177 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఇందులో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌, కమ్యూనికేషన్స్‌ వంటి విభాగాల పోస్టులున్నాయి.వీటిని ‘తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక బోర్డు’(టీఎ్‌సఎల్‌పీఆర్‌బీ) ద్వారా భర్తీ చేయాలని తెలిపింది. ఈ మేరకు సంబంధిత విభాగాల నుంచి కేడర్లవారీగా స్థానికత, ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు వంటి వివరాలను తెప్పించుకోవాలని టీఎ్‌సఎల్‌పీఆర్‌బీకి సూచించింది. ఇక ఎస్సీ అభివృద్ధి శాఖ కింద 549 పోస్టులను ‘తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ’ (టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎ్‌స)లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ నుంచి అవసరమైన వివరాలు తెప్పించుకోవాలని టీఎ్‌సపీఎస్సీని ఆదేశించింది.
వయసు సడలింపు ఉంటుందా?
పోలీసు ఉద్యోగాల భర్తీకి ఈసారి వయసు సడలింపు ఉంటుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. గత రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యర్థులకు వయసులో సడలింపునిచ్చింది. సాధారణంగా పోలీస్‌ ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు అర్హులు. గత ఎంపిక సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; బీసీ, జనరల్‌ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఇచ్చింది. ఈసారి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. గతంలో త్రుటిలో అవకాశాన్ని కోల్పోయిన వేలాది మంది అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటివారికి వయసు సడలింపు ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే.