రంగారెడ్డి జిల్లాలో 7న జాబ్‌మేళా

121
SHARE
రంగారెడ్డి, మాడ్గుల: మండల మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద ఈ నెల 7న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు హోటల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. పది నుంచి డిగ్రీ చదివిన 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు నిరుద్యోగ యువత సర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు. ఎంపికైన వారికి మూడు నెలల పాటు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, హోటల్ మేనేజ్‌మెంట్‌పై ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం వివిధ సంస్థలలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. వివరాల కోసం సెల్: 8008541919, 9676480348 నెంబర్లలో సంప్రదించాలన్నారు.