యువతకు హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

227
SHARE


హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మెకెన్సీ ఫౌండేషన్, సిటీ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కల్పిస్తోంది.మెకెన్సీ ఫౌండేషన్, సిటీ బ్యాంకు ఆధ్వర్యంలో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో రెండు నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధి పీవీఆర్ కృష్ణన్ తెలిపారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కలిగి ఉండి 18 నుంచి 28 సంవత్సరాల లోపు యువతీ యువకులు శిక్షణలో చేరేందుకు అర్హులన్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉపాధి అవకాశాలను చూపిస్తామన్నారు. నెలకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు జీతం ఉంటుందని వెల్లడించారు. ఇతర దేశాల్లో పని చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. వివరాలకు సెల్: 9000097781, 8897732197లో సంప్రదించాలని కోరారు.