తెలంగాణ – ఆంధ్ర మధ్య T-20 క్రికెట్ సిరీస్

121
SHARE

cric
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ టీ-20 టోర్నమెంట్ విజయవంతం కావటంతో మరో భారీ సిరీస్ కు ప్లాన్ చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేసన్. ఇదే తరహాలో తెలంగాణ – ఆంధ్ర మధ్య T-20 నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. మార్చి 7వ తేదీ బుధవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది అసోసియేషన్.
ఈ ఏడాది జూన్ లో తెలంగాణ – ఆంధ్ర క్రికెట్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఐపీల్ సీజన్ ముగిసిన తర్వాత షెడ్యూల్ ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను HCA త్వరలోనే ప్రకటించనుంది. ఇటీవల జరిగిన కాకా మెమోరియల్ T 20 టోర్నమెంట్ విజయవంతం కావడంపై హర్హం వ్యక్తం చేసింది.