తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉచిత కంటిపరీక్షలు

143
SHARE


రాష్ట్ర వ్యాప్తంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉచిత కంటిపరీక్షలు జరపనున్నట్లు చెప్పారు. మంగళవారం (మార్చి-13) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన..రోగాలను ముందుగానే గుర్తిస్తే పూర్తిస్థాయిలో ట్రీట్ మెంట్ చేయడానికి వీలుంటుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్య విధానం అభివృద్ధి చెందుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎర్పడ్డాక కేసీఆర్ కిట్ లాంటి పథకాలు రావడంతో ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. హెల్త్ విషయంలో సీఎం డీప్ గా ఆలోచిస్తున్నారని, కంటి పరీక్షలు చేయడానికి ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు లక్ష్మారెడ్డి. ఆరోగ్య తెలంగాణలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో కారెపొరేట్ ట్రీట్ మెంట్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు. మొబైల్ వాహనాలు మరిన్ని పెంచి ప్రజలవద్దకే చికిత్స తీసుకురావాలని సీఎంను కోరారు మంత్రి లక్ష్మారెడ్డి. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు జబ్బుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ప్రారంభంలో ఇమ్యునైజేషన్ 65 శాతం ఉంటే.. ఇప్పుడు దాన్ని 90 శాతానికి తీసుకువచ్చామని చెప్పారు. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.