గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

156
SHARE

Former MLA passes away due to heart attack - Sakshi
ఏలూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర(75) కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. అనంతరం ఆయన్ను ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. ఆయన 1994- 1999 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. సింగన్నదొర మృతిచెందారన్న సమాచారం తెలుసుకున్న పలువురు టీడీపీ నాయకులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.