నడుము నొప్పికి వైద్యం

163
SHARE


మనిషి శరీర భాగాల్లో వెన్నుపూస ముఖ్యమైనది. వివిధ రకాల ఒత్తిడి వల్ల, జీవన విధానంలోని మార్పు వల్ల, వెన్నెముకపై తీవ్ర ప్రభావం పడి వెన్నుపూసలలో అరుగుదల మొదలవుతుంది. డిస్క్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువును ఎత్తడం వల్ల, చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు వంగి పనిచేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి ఏర్పడుతుంది. మొదటగా నొప్పి మొదలైనపుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను కొద్ది రోజుల్లో దూరం చేసుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. వెన్నెముకలో నొప్పి 12 వారాలకు పైగా ఉన్నట్లయితే దానిని దీర్ఘకాలిక నొప్పిగా పరిగణించి వైద్యున్ని సంప్రదించవలెను.
నడుము నొప్పికి కారణాలు
బరువులను మోయడం వల్ల చేయాల్సిన శ్రమ కన్నా ఎక్కువ పనిచేసినపుడు, శరీరం ఒత్తిడికి లోనయినపుడు , వెన్నెముకలోని కండరాలు, లిగమెంట్‌ పై భారం పడి నొప్పి వస్తుంది. కాస్త విశ్రాంతి తీసుకున్నట్లయితే కండరాల ద్వారా వచ్చే నొప్పి తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి అలాగే ఉండిపోతే వైద్యున్ని కలిపి సూచనలు తీసుకోవాలి.
పూసలలో అరుగుదల వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది. శరీరానికి కాల్షియం అందకపోవడం వల్ల, డి విటమిన్స్‌ తగ్గిపోవడం వల్ల, అధికమైన ఒత్తిడి పూసలలో అరుగుదల వస్తుంది. దీనిని లంబారీ స్పాండిలోసిస్‌ అంటారు.
పని ఒత్తిడి పెరిగినపుడు, బరువులను ఎత్తడం వల్ల కొన్నిసార్లు డిస్క్‌ పక్కకు ఒరిగిపోతుంది. దీనిని స్లిప్‌డిస్క్‌ లేదా డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటారు. అనూహ్యంగా ఒకేసారి విపరీతమైన నడుము నొప్పి, కదలకుండా అయిపోవడం, స్లిప్‌ డిస్క్‌ వల్ల వస్తుంది. కొన్నిసార్లు ఈ డిస్క్‌ పక్కన నరాలపై ఒత్తిడి కలిగించినపుడు కాళ్లలో నొప్పి, తిమ్మిరి రావడం జరుగుతుంది.
వయసు పెరిగిన కొలదీ ఎముకల్లో అరుగుదల వలన నొప్పి వస్తుంది.
అధిక బరువు, హైపోథైరాయిడ్‌ జబ్బులు, దీర్ఘకాలిక ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ వెన్నుముక నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వెన్నుముకలలో ఇన్‌ఫెక్షన్స్‌ వలన, టీబీ, కొన్ని రకాల కణితుల వల్ల కూడా నొప్పి వస్తుంది.
లక్షణాలు..
మొదట తేలికపాటి నొప్పి నడుం కింది భాగంలో మొదలై, నొప్పి తీవ్రంగా మారి, మన దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తుంది.
నరాలపై ఒత్తిడి పెరిగినపుడు కాళ్లలో నొప్పి రావడం దానిని సియాటికా అంటారు. తిమ్మిర్లు మొదలవుతాయి.
కొన్ని డిస్క్‌ కంప్రెషన్‌ మూలన స్పైనల్‌ కెనాల్‌ మూసుకుపోవడం వలన నడవలేకపోవడం, కాళ్లలో వణుకురావడం, మూత్ర విసర్జన, మల విసర్జనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ..
వెన్నుముక సమస్యను గుర్తించడానికి మొదటగా.. ఎక్స్‌రే పరీక్ష చేయడం వలన పూసలలో అరుగుదల తెలుస్తుంది.
డిస్క్‌ గురించి తెలుసుకోవడానికి ఎమ్‌ఆర్‌ఐ పరీక్ష చేయించాలి. దీనివల్ల వెన్నుముక సమస్యకు కారణం తెలుస్తుంది.
వీటితో పాటు రక్తపరీక్షలు, సీబీపీ, ఈఎ్‌సఆర్‌, ఏఎన్‌ఏ పరీక్షలు చేయవచ్చును.
నడుం నొప్పికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒకే భంగిమలో చాలాసేపు ఉండకూడదు. కనీసం 45 నిమిషాలకోసారి భంగిమ తిరగాలి. నిల్చున్నవారు కూర్చోవాలి.
అధికబరువులు ఎత్తకూడదు. కింద కూర్చోకూడదు. ముందుకు వంగి పనులు చేయకూడదు. కూర్చున్నప్పుడు సరైన ఆధారాన్ని ఎంచుకుని కూర్చోవాలి.
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలి.
ఎముకలను బలహీన పరిచే ధూమపానం, మద్యపానం మానేయాలి. అన్ని వయసుల వారూ ఉదయం పూట సూర్యరశ్మిలో కొంత సమయం గడపలేను.
హోమియో వైద్యం
నడుం నొప్పికి శాశ్వతంగా నివారించడానికి హోమియోలో చక్కని మందులున్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులు ఇచ్చినట్టయితే మంచిఫలితాలు ఉంటాయి. అనూహ్యంగా వచ్చిన నడుం నొప్పిలో.. రస్టాక్స్‌, కాల్కేరియాప్లోర్‌, ఆర్నికా, బెల్లి్‌సపెర్‌, బ్రయోనియా, హైపలికమ్‌, రూట, గాల్థెరియా మందులు ఉపకరిస్తాయి.