ఆకుకూరలు ప్రకృతి మనకిచ్చిన అద్బుత వరం

260
SHARE

మనం రోజు వారి తినే వాటిలో అత్యంత ఆరోగ్యకరం అయినది ఎమన్నా ఉన్నవి అంటే అవి ఆకు కూరలు అని చెప్పటం లో అతిసయోక్తి  లేదు .
అసలు ఈ ఆకుకూరలు ఎన్ని రకాలు  వాటి ఉపయోగాలు తెలుసుకుందామా ?
ఆకుకూరలు శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లనను అందిస్తుంది…ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచి కరంగా చేసే ప్రత్యేక లక్షణం ఈ ఆకుకూరల సొంతం…ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరి వేయాలి…ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
మనకు ఎక్కువగా దొరికే ఆకు కూరలు…
పాలకూర, గొంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర, మునగాకు, క్యాబేజి, కాలిఫ్లవర్, పొన్నగంటి కూర, కోత్తిమీర, కరివేపాకు, పుదీన…మరి వీటి వలన ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
గోంగూర
దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీని వలన కంటి వ్యాధులు వచ్చే అవకాశం  తక్కువగా ఉంటుంది..
చుక్కకూర
దీనిలో విటమిన్ ఎ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది…
పాలకూర
దీనిలో విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకా ఎముకల సాంద్రతకు కూడా బాగా ఉపయోగపడుతుంది…
తోటకూర
దీనిలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది…అంతేకాక ఎముకలకు బలాన్నిస్తుంది. రక్తకణాల ఆరోగ్యానికి ఉపయోగ పడుతుంది..
బచ్చలి కూర
విటమిన్ ఎ, సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన కొత్తగా రక్తకణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పొన్నగంటి కూర
దీనిలో విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది…శరీరంలోని క్రిములని నాశనం చేస్తుంది. అంతేకాక ఎముకల బలాన్ని పెంచి మనిషి దృఢంగా అయ్యేట్టు చేస్తుంది…
మునగాకు
దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్నిస్తుంది…
కొత్తిమీర
దీనిలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. అంతే కాకుండా వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది…
కరివేపాకు
మనం తినేటపుడు కూరలో కరివేపాకు వస్తే తీసి పక్కన వేస్తాం…కానీ ఆ కరివేపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి…దీనిలో బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సంరక్షణకు, అరుగుదల ఉపయోగపడుతుంది..
పుదీనా
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గుతుంది…
క్యాబేజి
ఇది మధుమేహులకు చాలా బాగా ఉపయోగపడుతుంది..నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది…
కాలీ ఫ్లవర్
దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండడంవలన ఎముకలకు, పంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది ….
మెంతి కూర
దీనిలో పీచుపదార్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువుకు, గుండె ఆరోగ్యానికి,, కాలేయ ఆరోగ్యానికి మంచిది…
ఆకు కూరలను పప్పులో కలిపి వండడం వలన పోషకపదార్దాలు బాగా లభించి ఆరోగ్యానికి మేలు చేస్తాయి . ఆకు కూరలను విడిగా వండేటప్పుడు నీళ్లతో ఉడికించి వండాలి. నూనె ఎంత తక్కువగా వాడితే అంత మంచిది…మనకు తక్కువ ధరలో దొరికే ఆకుకూరలు తినడం వల్ల ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి….