Home Raashi Phalalu 13 మంగళవారం మార్చి 2018 మీ రాశీ ఫలాలు

13 మంగళవారం మార్చి 2018 మీ రాశీ ఫలాలు

57
SHARE

మేషం : వ్యాపారంలో, మీరు చేపట్టిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. కొత్తవారితో పరిచయాలకు, స్నేహాలకు అనుకూలమైన రోజు. ఒత్తిడికి లోను కాకండి. స్థిరమైన ఆలోచనలతో ఉండండి. భూమి లేదా ఇల్లు అమ్మకానికి అనుకూలమైన రోజు.

వృషభం : ఈ రోజు కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి.

మిథునం : ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరుగవచ్చ. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

కర్కాటకం : మీ మిత్రులను కలుసుకుంటారు.ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యా పార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

సింహం : ఉద్యోగ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవస రం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

కన్య : అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

తుల : ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగత్త అవసరం. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృశ్చికం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చ. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగత్త అవసరం. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

ధనుస్సు : ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహారశైలీ కానీ ఎదుటివారిని ఇబ్బం ది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు.

మకరం : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉం డాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

కుంభం: ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవస రం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూ సుకోండి. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

మీనం : ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహా యం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here