12-monday-march-2018-horoscopes-details-

133
SHARE

మేషం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ సంతానం కారణంగా ఆనందాన్ని పొందుతారు. వివాహ సంబంధ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.
వృషభం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరగవచ్చు. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.
మిథునం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.
కర్కాటకం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.
సింహం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యా పార లావాదేవీలకు అనుకూల దినం కాదు.
కన్య : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.
తుల : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కోసం ఎదురుచస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మా ట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
ధనుస్సు : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కానీ, స్నేహితులను కానీ కలుసుకుంటారు. గృహ సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు పూర్తి చేస్తారు.
మకరం : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగత్త అవసరం. పొర పాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.
కుంభం : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యకమాల్లో మునిగితేలుతారు. మీ జివిత భాగస్వామితో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.
మీనం : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. ప్రయాణాల్లో జాగత్త అవసరం. స్త్రీల విషయంలో కల్పించకోకండి.