సంత్ సేవాలాల్ చిరస్మరణీయుడు :మంత్రి లక్ష్మారెడ్డి

216
SHARE


సంత్ సేవాలాల్ మహరాజ్ చిరస్మర ణీయుడని వైద్యారోగ్య శఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ 279వ జయంతి వేడుకలను జడ్చర్లలో గురువారం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఎంపీపీ కార్యాలయంలో సేవాలాల్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సాంప్రదాయ పద్ధతిలో ఆయన చిత్రపటం ఎదుట పూజలు నిర్వహించారు. సంత్ సేవాలాల్ సేవాతత్పరుడని, అతని త్యాగగుణం, ధైర్యసాహసాలతో చిరస్మరణీయుడయ్యాడన్నారు.
సేవాలాల్ మహరాజ్‌తో శ్రీ వేంకటేశ్వర భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు హతీరాంబాబా కూడా బంజారాతెగకు చెందిన వ్యక్తి కావడం ఎంతో విశేషమన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎంపీపీ లక్స్మీశంకర్,జెడ్పిటీసి జయప్రద మార్కెట్ కమిటీ చైర్మన్ సర్పంచి టీఆర్‌ఎస్ నాయకులు, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.